Priyank Kharge: కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఢిల్లీ ఎర్ర కోట కార్ బాంబ్ దాడిపై స్పందించారు. ఈ దాడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నిందించారు. ఆయన ‘‘స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ హోం మంత్రి’’ అని, వెంటనే రాజీనామా చేయాలని మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సంఘటన జాతీయ భద్రత, జవాబుదారీతనం గురించిన తీవ్రమైన ఆందోళనల్ని లేవనెత్తుతుందని అన్నారు. పదేపదే వైఫల్యాలు జరుగుతున్నా అమిత్ షా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో అసిమ్ మునీర్ సైనిక తిరుగుబాటు.. సైన్యం లేకుండానే పని కానిచ్చేశాడు..
ఇన్ని వైఫల్యాలు జరిగితే ఇతర రాష్ట్రాల్లో లేదా దేశంలో ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించేవారని, కానీ అమిత్షాకు ప్రధాని మోడీ రహస్యాలు అన్ని తెలుసు కాబట్టే ఆయనను తొలగించడం లేదని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లోని మరో మత్రి ఎంబీ పాటిల్ కూడా ఇది భద్రతా వైఫల్యమని దుయ్యబట్టారు. బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ జరిగినప్పుడు రాజీనామాలను బీజేపీ కోరిందని ఆయన గుర్తు చేశారు.
