Site icon NTV Telugu

Bihar: ఓ ఖైదీ కీలక నిర్ణయం.. జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి

Biharmarriage

Biharmarriage

సహజంగా కారాగారం అంటే ఒక భిన్నమైన వాతావరణం అంటుంది. పెద్ద ఎత్తున గోడలు.. సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఖైదీలతో విచిత్రమైన పరిస్థితులుంటాయి. అలాంటి జైలు.. వివాహ వేడుకగా మారిపోయింది. ఓ ఖైదీ.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ సంఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలోని ఒక జైల్లో జరిగింది.

ఇది కూడా చదవండి: PM Modi: జీఎస్టీపై మోడీ కీలక ట్వీట్

2022లో ఖైదీకి చెందిన అన్నయ్య చనిపోయాడు. అనంతరం వదినతో ఖైదీ సంబంధం పెట్టుకున్నాడు. భర్త మరణించిన దగ్గర నుంచి మరిదితోనే సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి 2024, జూన్ 29న స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో మరిదిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అత్యాచార కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

ఇది కూడా చదవండి: Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్

అయితే అత్యాచార బాధితురాలు(వదిన)ను పెళ్లి చేసుకుంటానని.. బెయిల్ ఇవ్వాలంటూ ఖైదీ పాట్నా హైకోర్టును అభ్యర్థించాడు. అనంతరం పెళ్లికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే వివాహ ఏర్పాట్లు చేయాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం జైల్లోనే అధికారులు ఏర్పాట్లు చేశారు. జైలు సిబ్బంది.. తోటి ఖైదీల మధ్య వివాహం జరిపించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జైలు యంత్రాంగం ఈ వేడుకకు ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. బంధువులకు బదులుగా జైలు సిబ్బంది, తోటి ఖైదీలు సాక్షుల పాత్ర పోషించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశానుసారం వివాహం జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ శాంతి భూషణ్ తెలిపారు.

Exit mobile version