తమిళనాడు కృష్ణగిరిలోని ఓ పాఠశాలలో నకిలీ ఎన్‌సీసీ క్యాంపులో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు శివరామన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్‌కు ముందు విషం తాగినట్లు చెప్పారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే ముందు ఆగస్టు 19న ఎలుకల మందు సేవించాడు. ఆ క్రమంలో కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో అతడ్ని కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మరింత విషమించడంతో సేలంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం తుది శ్వాస విడిచినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్
కృష్ణగిరిలోని ఓ స్కూల్‌ను శివరామన్ సంప్రదించాడు. ఎన్‌సీసీ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పగానే.. అతడి బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోకుండానే యాజమాన్యం అనుమతి ఇచ్చేసింది. 17 మంది బాలికల సహా 41 మంది విద్యార్థులకు పాఠశాలలో క్యాంప్ నిర్వహించారు. స్కూల్ ఆడిటోరియం మొదటి అంతస్తులో బాలికలకు, గ్రౌండ్ ఫ్లోర్‌లో బాలురకు వసతి కల్పించారు. అయితే ఎన్‌సీసీ శిబిరాన్ని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను యాజమాన్యం నియమించలేదు. ఇదే అదునుగా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై శివరామన్ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు గురి చేశాడు. అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తే.. పరువుపోతుందని చప్పుడు చేయలేదు. అనంతరం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో శివరామన్ కూడా ఉన్నాడు. అయితే అతడ్ని అరెస్ట్ చేసేందుకు వెళ్తే.. విషం సేవించాడు. శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఇది కూడా చదవండి: TPCC Chief Post: తెలంగాణ పీసీసీ చీఫ్పై ఢిల్లీలో కసరత్తు..
