PM Modi: కొత్త పార్లమెంట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కీలక ఉపన్యాసం ఇచ్చారు. కొత్త పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన రాజదండం ‘సెంగోల్’ జాతీయవాదానికి చిహ్నంగా ఉంటుందని అన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది.. 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని చెప్పారు. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుంది.. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయంగా అభివర్ణించారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
Read Also: Rahul Gandhi: “ఇది పట్టాభిషేకం”.. కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం వల్ల 60,000 మంది కార్మికులకు ఉపాధి లభించిందని, వారి కోసం ప్రత్యేకంగా డిజిటల్ గ్యాలరీని కూడా నిర్మించామని ప్రధాని చెప్పారు. భవిష్యత్తులో, ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు, వారు ఎక్కడ కూర్చుంటారు? అందువల్ల, కొత్త పార్లమెంటు భవనం అవసరమైందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీల సంఖ్య పెరుగుదల భవిష్యత్తులో ఉంటుందని అందుకే కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి, పాత పార్లమెంట్‌లో తగినన్ని సీట్లు లేవు, పాత పార్లమెంట్‌లో సాంకేతిక సమస్యలున్నాయని ప్రధాని అన్నారు. 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని అన్నారు.
