NTV Telugu Site icon

PM Narendra Modi: భారతదేశాన్ని స్టార్టప్ హబ్‌గా మార్చడంలో బెంగళూర్ కీలకం

Pm Narendra Modi

Pm Narendra Modi

Prime Minister Narendra Modi’s Karnataka visit: రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూర్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. దక్షిణాదిలో తొలి వందేభారత్ రైలుతో పాటు బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2, నాదప్రభు కెంపెగౌడ 108 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read Also: Jagga Reddy: పూర్తిగా మారిపోయిన జగ్గారెడ్డి.. గుర్తు పట్టడం కూడా కష్టమే..!

బెంగళూర్ లో ‘‘ స్టాచ్చూ ఆప్ ప్రాస్పెరిటీ’ ప్రారంభంలో ఆయన ప్రసంగించారు. దేశానికి కర్ణాటక అందిస్తున్న సహకారాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. భారత దేశంలో స్టార్టప్స్ స్పూర్తికి బెంగళూర్ నగరం ప్రాతినిధ్యం వహిస్తోందని శుక్రవారం అన్నారు. బెంగళూర్ రావడం తన అదృష్టం అని అన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు, ప్రపంచ స్థాయి విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభం కర్ణాకట ప్రజలకు గొప్ప రోజు అని అభివర్ణించారు. కెంపెగౌడ విగ్రహం భారతీయులు ప్రపంచ నాయకులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు స్పూర్తినిస్తుందని అన్నారు.

స్టార్టప్స్ అనేవి కేవలం ఓ సంస్థ మాత్రమే కానది.. దేశ పురోగతిలో ఉన్నత శిఖరాలు అందుకోవాలనే విశ్వాసం, ఆశయం అని అన్నారు. స్టార్ట‌ప్‌ల‌కు బెంగళూర్ ప్రపంచ ప్రసిద్ధి చెందిందని.. భారతదేశాన్ని స్టార్టప్ హబ్ గా మార్చడంలో బెంగళూర్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. భారతదేశంలో రైల్వేను ఆధునీకీకరిస్తున్నామని, ఆధునిక రైల్వే స్టేషన్లను తయారు చేయడమే కాకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, కనెక్టివిటీ పెంచడం మా లక్ష్యమని అన్నారు.