NTV Telugu Site icon

PM Modi: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ

Modi

Modi

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నెతన్యాహు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. యుద్ధం గురించి ఆలోచించాలని మోడీ పేర్కొన్నారు. బందీల విడుదల, కాల్పుల విరమణ గురించి భారత్ మానవతా సహాయం చేస్తుందని మోడీ నొక్కిచెప్పినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై కాలు దువ్వుతోంది. ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని ఇప్పటికే అమెరికా ప్రకటన చేసింది. అలాగే యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే దేవుడు కూడా క్షమించడని ఇరాన్ పేర్కొంది. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి.