Site icon NTV Telugu

PM Modi: పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు.. అందుకే ధరలు తగ్గడం లేదు

Modi

Modi

కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మోదీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. రాష్ట్రాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని.. అప్పుడే ప్రజలపై పెట్రోల్ ధరల భారం తగ్గుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

కాగా పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ ధరల పెంపు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. అయితే హైదరాబాద్‌లో పదిరోజులుగా పెట్రోల్ ధరలు నిలకడగా సాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.49గా ఉంది. ఏపీలోని విజయవాడలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు తగ్గి రూ.121.28గా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.0.15 పైసలు తగ్గి రూ.106.89 గా ఉంది.

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోకు ముహూర్తం ఖరారు.. షేర్ ధర ఎంతో తెలుసా?

Exit mobile version