ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..
భారత్ వంద కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. అందరి సహాయ సహకారాలతో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయిందన్నారు. కరోనా పై యుద్ధంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కనుగొంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన దేశాలే నేడు భారత్ వైపు చూస్తున్నాయి అన్నారు. ఇదంతా భారత ఐక్యమత్య శక్తికి నిదర్శనమన్నారు.
వ్యాక్సినేషన్‌లో భారత్ స్పీడు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు ప్రధాని మోడీ… అసలు ఇది ఎలా సాధ్యమైందని ప్రపంచ దేశాలు అడుగుతున్నాయన్న్నాన ఆయన.. దీనికి అందర్ని కలుపుకుని వెళ్లడమేనని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలకు సైతం వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని తెలిపారు భారత ప్రధాని.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నా మన్నారు. ఇప్పటి వరకు ఈ దేశం అది తయారు చేసింది, ఇది తయారు చేసిందని చెప్పుకుంటున్నామని.. కానీ, నేడు అన్నింటి పైనా “మేడ్ ఇన్ ఇండియా” అని ఉండటం దేశానికి ఎంతో గర్వకారణం అన్నారు. ఇది దేశం సాధించిన ఘనతగా చెప్పారు ప్రధాని మోడీ.