Site icon NTV Telugu

RRR: భారతీయులు గర్వించేలా చేశారు.. ట్రిపుల్ ఆర్‌కి ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు

Rrr Modi

Rrr Modi

PM Narendra Modi congratulated RRR film team: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా బుధవారం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ట్రిపుల్ ఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: MG Motor: ఎంజీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు.. త్వరలోనే భారత్‌లో విడుదల.. ప్రత్యేకతలు ఇవే..

భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రిపుల్ ఆర్ టీంకు అభినందనలు తెలిపారు. ప్రతీ భారతీయుడు గర్వించేలా చేశారని ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలిపారు. ‘‘ చాలా ప్రత్యేకం..ఎంఎం కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు అభినందనలు. ఎస్ఎస్ రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ట్రిపుల్ ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు’’ తెలుపుతూ ట్వీట్ చేశారు. అవార్డ్ వీడియోను షేర్ చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్రిపుల్ ఆర్ టీంకు అభినందనలు తెలియజేశారు. ‘‘ మన కళకు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందడం కంటే మన దేశం గర్వించదగిన క్షణం మరోటి ఉండదు’’ అంటూ ట్వీట్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ తో పాటు హిందీ, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో గుర్తింపు పొందింది. ముఖ్యంగా విదేశాల్లో నాటు నాటు పాట చాలా ఫేమస్ అయింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్ గన్, శ్రియ, అలియాభట్ ఇతర పాత్రలు పోషించారు.

 

Exit mobile version