Site icon NTV Telugu

Heeraben Modi: కోలుకుంటున్న ప్రధాని మోదీ తల్లి.. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్

Heeraben Modi

Heeraben Modi

Prime Minister Modi’s mother is recovering: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. నిన్న అనారోగ్యంతో అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఆమె ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ‘‘హీరాబా ఆరోగ్యం ఉన్నారని.. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపుడుతోందని.. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని.. నిన్న రాత్రి నుంచి ఓరల్ డైట్ ప్రారంభమైందని’’ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Read Also: Rashmika Mandanna: దక్షిణాది సినిమాల పాటలపై రష్మిక అనుచిత వ్యాఖ్య

జూన్ నెలలో 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్.. శ్వాసకోశ సమస్యలతో నిన్న ఆస్పత్రిలో చేరారు. విషయం తెలిసిన వెంటనే మోదీ ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు విమానంలో అహ్మదాబాద్ కు వెళ్లారు. ప్రధాని వస్తుండటంతో ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ప్రధాని గంట పాటు తల్లిని పరామర్శించి మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని తన తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తల్లితో కలిసి ప్రధాని మోదీ టీ తాగుతున్న దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version