Site icon NTV Telugu

PM Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు పరామర్శ

Modi

Modi

ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని మోడీ పరామర్శించనున్నారు. అనంతరం మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు.

ఇది కూడా చదవండి: Air India Plane Crash: ఎయిరిండియా విమాన దర్యాప్తు కోసం భారత్ రానున్న బ్రిటిష్ ఏజెన్సీ..

గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 15 మంది మెడికోలు కూడా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Air India plane crash: విమానం టేకాఫ్ వెనక ఉన్న సైన్స్ ఇదే.. విమాన గతిని నియంత్రించే 4 శక్తులు..

 

Exit mobile version