Priest Suicide: కాళీమాత తనకు దర్శనం ఇవ్వలేదని ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటల పాటు ప్రార్థన నిర్వహించినా కాళీమాత తనకు కనిపించలేదని 45 ఏళ్ల పూజారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం గైఘాట్ పతంగలిలోని తన అద్దె నివాసంలో అమిత్ శర్మ గొంతు కోసుకున్నాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను మరణించారు.
Read Also: Section 498A: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య.. వరకట్న చట్టాలపై చర్యలకు లాయర్ల డిమాండ్..
కాళీ దేవీకి అపర భక్తుడైన అమిత్ శర్మ శనివారం నుంచి గదిని మూసి వేసి, అమ్మవారి కోసం 24 గంటల పాటు ప్రార్థనలో ఉన్నారు. దేవత కనిపిస్తుందని, అతడిని కరుణిస్తుందని చెప్పినట్లు సంబంధితులు చెప్పారు. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన నిరంతరం ‘‘మా కాళీ దర్శన దే’’ అని జపించారు. చాలా గంటలు గడిచే కొద్ది నిరాశ చెంది, కొత్తితో గొంతు కోసుకున్నాడు.
‘‘అతను (పూజారి) కాళీ దేవి తన ముందు ప్రత్యక్షమవుతుందని పట్టుబట్టాడు. అది జరగకపోవడంతో, అతను అతని గొంతు కోసుకున్నాడు. అతన్ని స్థానిక ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌కు తరలించగా, అక్కడ అతను గాయాలతో మరణించాడు’’ అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఇషాన్ సోని చెప్పారు. పూజారి ఏడేళ్ల నుంచి తన ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు యజమాని చెప్పారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తు్న్నాడని, మతపరమైన తీర్థయాత్రలకు వెళ్లేవాడని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.