NTV Telugu Site icon

LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

Commercial Lpg Price

Commercial Lpg Price

LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు కొంతమేరకు తగ్గించాయి. రూ.36 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.36 మేర తగ్గి ప్రస్తుతం రూ.1976.50కు చేరింది.

Audio Call Leak: లోన్ యాప్ వసూళ్లు ఇంత దారుణంగా ఉంటాయా ?

గతంలో దీని ధర సిలిండర్‌కు రూ. 2012.50గా ఉండేది. కోల్‌కతాలో సిలిండర్‌కు రూ.2095.50గా మారింది. గతంలో దీని ధర సిలిండర్ రూ.2132గా ఉండేది. రూ.2021కు, ముంబైలో సిలిండర్‌కు గతంలో రూ.1972.50గా ఉన్న సిలిండర్ రూ.1936.50గా మారింది. తగ్గించిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, తినుబండారాలు, టీ స్టాల్స్, 19 కిలోల సిలిండర్లలో అతిపెద్ద వినియోగదారు సెగ్మెంట్‌గా ఉన్న ఇతరులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.