ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ కాబట్టే.. మూడోసారి దేశ ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Satya Kumar Yadav: క్యాన్సర్‌తో చాలా మంది చనిపోతున్నారు.. సరైన అవగాహన కల్పించాలి!
21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో 14 సార్లు మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలకు మోడీ ధన్యవాదాలు చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని.. ప్రజలకు కొత్త ఆశను ఇస్తోందని.. స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. తాము నకిలీ నినాదాలు ఇవ్వలేదని.. ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Shivam Dube: గోల్డెన్ లెగ్.. ఆడిన మ్యాచ్ గెలవాల్సిందే