రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అలాంటిది కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రాష్ట్రపతి కార్యాలయంలో ఇన్‌స్ట్రాగామ్ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Darshan: ఇంటి ఆహారం కోసం హైకోర్టులో హీరో దర్శన్ పిటిషన్
వీడియోలో ప్రెసిడెంట్ ముర్ము తెల్లటి సల్వార్-కుర్తా మరియు స్పోర్ట్స్ షూస్ ధరించారు. కోర్టులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆడారు. అనేక మంది సిబ్బంది, ప్రేక్షకులు వీక్షించారు. ప్రెసిడెంట్ మూడు పాయింట్లు సాధించడం మరింత ఆశ్చర్యకరమైన విషయం.