NTV Telugu Site icon

President Election: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారు

President

President

రాష్ట్రపతి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీడియాతో స‌మావేశ‌మై, షెడ్యూల్‌ను ప్రక‌టించ‌నుంది. ప్రస్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీకాలం వ‌చ్చే నెల జులై 24తో ముగియ‌నుంది. 2017, జులై 25న రాష్ట్రప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక‌య్యారు. ఉత్తర‌ప్రదేశ్ నుంచి రాష్ట్రప‌తిగా ఎన్నికైన తొలి వ్యక్తి రామ్‌నాథ్ కోవిందే.

Gujarat: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించిన ఆర్మీ

రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరు ఓటు హక్కు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఓటింగ్‌ బ్యాలట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ఓటింగ్‌ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే అది రద్దవుతుంది.