President Droupadi Murmu Flies In Fighter Jet In Assam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం తొలుత తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరానికి చేరుకున్నారు. భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్న అనంతరం.. ఆమె ఫ్లయింగ్ సూట్ ధరించి, సుఖోయ్-30 విమానంలో విహరించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. దీనిపై ట్విటర్ మాధ్యమంగా.. “అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చారిత్రాత్మకంగా ప్రయాణించారు. ముర్ముతో కలిపి మొత్తం ముగ్గురు రాష్ట్రపతులు యుద్ధ విమానంలో ప్రయాణించగా.. మహిళా రాష్ట్రపతుల్లో ముర్ము రెండోవారు” అంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.
Vladimir Putin: పుతిన్‌కు ఘోర అవమానం.. పాపం నవ్వులపాలయ్యాడుగా!
కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం గౌహతిలో మౌంట్ కంచెన్‌జంగా సాహసయాత్ర-2023ను కూడా ప్రారంభించారు. గౌహతిలోని గౌహతి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానూ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తన పర్యటనలోని చివరి రోజులో భాగంగా.. తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. జూలై 2022లో దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని స్వీకరించిన అనంతరం.. రాష్ట్రపతి ముర్ముకు ఇది రెండో రాష్ట్ర పర్యటన. తమ రాష్ట్రానికి పర్యటించేందుకు రాష్ట్రపతి రావడానికి ముందు.. అస్సాం సీఎం హిమంత బిశ్వ ప్రసాద్ ట్విటర్ మాధ్యమంగానూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆతిథ్యం ఇవ్వడానికి అస్సాం ఎదురుచూస్తోందని అన్నారు. అంతేకాదు.. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు కూడా!
Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..