NTV Telugu Site icon

Pre-wedding shoots: ప్రీ వెడ్డింగ్ షూట్స్ అమ్మాయిలకు హానికరం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు..

Pre Wedding Shoots

Pre Wedding Shoots

Pre-wedding shoots harmful for brides: ఈ మధ్య కాలంలో పెళ్లి కన్నా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. చిత్రివిచిత్రంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కాంట్రవర్సీలకు, ప్రమాదాలకు కూడా కారణం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించి ఛత్తీస్‌గఢ్ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ కిరణ్మయి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.

Read Also: UPI 123 PAY: ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు.. ఈ విధానంతో టాటా క్యాపిటల్ లావాదేవీలు..

కిరణ్మయి నాయక్ అధ్యక్షతన 172వ పబ్లిక్ హియరింగ్ మే9న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ జరిగింది. దీంట్లో భార్యభర్తల మధ్య వివాదాలే ఎక్కువగా లిస్ట్ అయ్యాయి. ఈ సందర్భంలో ఇందులో ఓ కేసును పరిశీలిస్తే.. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన పెళ్లి జరగలేదని ఒకరు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే హియరింగ్ సమయంలో ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఇరు పక్షాలు పెళ్లి ఏర్పాట్లకు, ఫోటోలకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు పెట్టిన ఖర్చులను చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయని, ఫ్రీ వెడ్డింగ్ వీడియోలను, ఫోటోలను డిలీట్ చేసేలా ఒప్పందం కుదరిందని కమిషన్ ముందు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్య్కులేట్ కాకుండా ఈ చర్యలు తీసుకున్నారని దరఖాస్తుదారు చెప్పారు.

ఈ కేసును పరిశీలించిన తర్వాత కిరణ్మయి నాయక్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రజలు పాశ్యత్య సంస్కృతి ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఇది మన భారత సంస్కృతిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం పెళ్లిళ్లకు ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లను నివారించాలని కోరారు. ఇది ఒకవేళ పెళ్లిళ్లు విఫలం అయినప్పుడు, విడాకుల వరకు వెళ్తే అమ్మాయిలకు హానికరంగా మారే అవకాశం ఉందని అన్నారు.

Show comments