Site icon NTV Telugu

Praveen Nettaru Case: ప్రవీణ్ నెట్టారు మర్డర్ కేసు.. 33 చోట్ల ఎన్ఐఏ సోదాలు

Praveen Nettaru Case

Praveen Nettaru Case

Praveen Nettaru Case: బీజేపీ నేత ప్రవీణ్ నెట్టార మర్డర్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు జిల్లాలో విస్తృతంగా సోదాలను నిర్వహించింది. మూడు జిల్లాల్లో 33 చోట్ల సోదాలు చేశారు అధికారులు. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యులుగా ఉన్న నిందితులు.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారును హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కుట్ర కోణం ఉండటంతో పాటు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.

నిందితులు, అనుమానితుల ఇళ్ల నుంచి డిజిటల్ పరికరాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, నగదు, నేరారోపిత పత్రాలు, నిషేధిత ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూలై 26న బెల్లారేలోని తన దుకాణం ఎదుట ప్రవీణ్ నెట్టారు(32)ను బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు నరికి చంపారు. ఈ ఘటనపై దక్షిన కన్నడ జిల్లాలోని బెల్లారే పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదు కాగా.. ఎన్ఐఏ ఆగస్టు 4న కేసు నమోదు చేసింది.

Read Also: Rahul Gandhi Bharat JODO Yatra LIVE: భారత్ జోడో యాత్రతో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందా.?

ప్రవీణ్ నెట్టారు దారుణహత్య కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచింది. పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు నిరసన, ఆందోళనలకు పాల్పడ్డారు. రాళ్లదాడి, పోలీసులు లాఠీఛార్జ్ ఘటనలు జరిగాయి. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పుత్తూర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ప్రవీణ్ నెట్టారు హత్యపై బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. హిందూ కార్యకర్తల జీవితాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం లేదని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఉద్రిక్తతల నడుమ రాష్ట్రప్రభుత్వం ఈ కేసును ఆగస్టు 3న ఎన్ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version