NTV Telugu Site icon

Prakash Raj: వాళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప కరవరు.. ద కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా

Prakash Raj On Kashmir File

Prakash Raj On Kashmir File

Prakash Raj Comments On Boycott Batch Over Pathaan Film: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్, తాజాగా బాయ్‌కాట్ బ్యాచ్‌ని ఏకిపారేశారు. పఠాన్ సినిమాని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ బ్యాచ్, మోడీ సినిమాను రూ.30 కోట్ల వరకు కూడా నడపలేకపోయారని చురకలంటించారు. అంతర్జాతీయ జ్యూరీ ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శించినా.. తనకెందుకు ‘ఆస్కార్’ రాలేదంటూ దర్శకుడు సిగ్గులేకుండా అడుగుతున్నాడని, అతనికి కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కేరళలో నిర్వహించిన ఎంబీఐఎఫ్ఎల్ 2023 వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Ruhani Sharma: డర్టీ హరి భామ.. బ్రా లేకుండా బాగానే చూపిస్తుందే

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్ బాయ్‌కాట్ బ్యాచ్ మొత్తం పఠాన్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది రూ.700 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది. పఠాన్‌ని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ ఇడియట్స్.. మోడీ సినిమాని కనీసం రూ.30 కోట్ల వరకు కూడా నడిపించలేకపోయారు. వీళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప, కరవరు. వీరి విషయంలో చింతించాల్సిన అవసరమే లేదు. వీరి వల్ల శబ్ద కాలుష్యం సంభవిస్తుంది. ఇక కశ్మీర్ ఫైల్స్ అయితే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటి. ఆ సినిమాను ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసు. అంతర్జాతీయ జ్యూరీ ఈ సినిమాపై ఉమ్మేసింది. సిగ్గుచేటు ఏమిటంటే.. నాకెందుకు ఆస్కార్ రాలేదని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అడుగుతున్నాడు. అతనికి కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. విదేశాల్లో సెన్సిటివ్ మీడియా ఉంది. కానీ, ఇక్కడ ఒక ప్రోపగాండా సినిమా తీయొచ్చు. ద కశ్మీర్ ఫైల్స్ తరహా సినిమాలు చేసేందుకు రూ.2 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నారని నాకు తెలిసింది’’ అంటూ చెప్పుకొచ్చారు.

MS Dhoni: రైతుగా మారిపోయిన ఎంఎస్‌ ధోనీ.. ట్రాక్టర్‌తో పొలం దున్నేస్తున్నాడుగా..

కాగా.. తాను రాజకీయాల్లో లేకపోయినా, రాజకీయ వ్యవహారాలపై చాలాకాలం నుంచి ప్రకాశ్ రాజ్ గొంతెత్తుతున్నారు. ముఖ్యంగా.. ప్రధాని మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒక దేశ పౌరుడిగా తాను ప్రశ్నిస్తున్నానే తప్ప, కావాలనే టార్గెట్ చేయడం లేదని వివరణ ఇస్తూనే వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బహిరంగంగా ఇలాంటి డేరింగ్ వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ గట్స్‌ని మెచ్చుకోవాల్సిందేనని కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం యాంటీ హిందూ అంటూ ఆయనపై ఎగబడుతున్నారు.

Show comments