Site icon NTV Telugu

Prajwal Revanna scandal: సెక్సు టేపులపై తొలిసారిగా స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ..

Prajwal Revanna Sex Tapes Scanda

Prajwal Revanna Sex Tapes Scanda

Prajwal Revanna scandal: కర్ణాటకలో జేడీయూ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలో వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల ఈ వీడియోలు వెలుగులోకి రావడం, ముఖ్యంగా హసన్ జిల్లాలో వైరల్ కావడంతో ప్రజ్వల్ బెంగళూర్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి వెళ్లిపోయాడు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. ‘‘సత్యం త్వరలోనే గెలుస్తుంది’’ అని అన్నారు.

మరోవైపు ఈ కేసుపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీఎం సిద్ధరామయ్య తాజాగా దేవెగౌడపై సంచలన ఆరోపణలు చేశారు. దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ‘ప్లాన్’ చేసి విదేశాలకు పంపించారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఆరోపించారు. ‘‘విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు, వీసా ఎవరు ఇస్తారు..? కేంద్రం ఇస్తుంది. కేంద్రానికి తెలియకుండా వెళ్లగలదా..? మాజీ ప్రధాని దేవెగౌడ ప్లాన్ చేసి విదేశాలకు పంపించారు’’ అని సిద్ధరామయ్య అన్నారు.

Read Also: Kerala: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి మూడు “జీవితఖైదు” శిక్షలు విధించిన కోర్టు..

దాదాపుగా 3000 వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలు తమ ఇంట్లో పనిచేసే ఆడవాళ్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారి ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ వీరిద్దరిపై లైంగిక వేధింపుల ఆరోపనలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరం ప్రస్తుతం బీజేపీకి తలనొప్పిగా మారింది. కర్ణాటకలో జేడీయూ-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు ఈ వ్యవహరం రేవణ్ణ కుటుంబానికి చెందినదని, ఇందులోకి తనను, తన తండ్రి దేవెగౌడను ఎందుకు లాగుతున్నారని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

Exit mobile version