Site icon NTV Telugu

Prajwal Revanna Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను లీక్ చేసిన డ్రైవర్ మిస్సింగ్..

Prajwal Revanna Sex Scandal

Prajwal Revanna Sex Scandal

Prajwal Revanna Sex Scandal: మాజీ ప్రధాని హెడ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజ్వల్‌కి సంబంధించిన 3000 సెక్స్ వీడియోలు వెలుగులో వచ్చాయి. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జెడీఎస్ పార్టీ అతని బహిష్కరించింది.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి ప్రశంసలు.. బీజేపీ ఆగ్రహం..

ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. తమ ముందు హాజరు కవాలని ప్రజ్వల్‌ని సిట్ కోరింది.దీనికి మరికొంత సమయం కావాలని అతను కోరారు. అతని అభ్యర్థనపై సిట్ ఇంకా స్పందించలేదు. ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి బెంగళూర్ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మే 15న అతను బెంగళూర్ వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు జేడీఎస్ నేత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ని బీజేపీ నేత దేవరాజేగౌడకు ఇచ్చినట్లు అంగీకరించి ప్రజ్వల్ రేవణ్ణ మాజీ డ్రైవర్ సిట్ నోటీసుల అనంతరం అదృశ్యమయ్యారు. డ్రైవర్ కార్తీక్ ప్రజ్వల్ రేవణ్ణతో కలిసి 13 ఏళ్లుగా పనిచేసి ఏడాది క్రితం భూ ఒప్పందంలో అతడితో గొడవపడ్డాడు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ డ్రైవర్ కార్తిక్ అదృశ్యం వెనక పలుకుబడి ఉన్న నేతలు ఉన్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ని ఉద్దేశిస్తూ.. కార్తిక్‌ని ఎవరు మలేషియా పంపారని ప్రశ్నించారు. దీనిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు అన్నీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం నుంచి అతడికి సమాచారం ఇవ్వండి. అతడిని విదేశాలకు పంపే పిచ్చి నాకు లేదు. నేను స్ట్రీట్ ఫైటర్‌ని, మనుషులను దాచి పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు, వారికి(దేవెగౌడ) కుటుంబానికి అవసరం’’ అని అన్నారు.

Exit mobile version