NTV Telugu Site icon

Pragya Thakur: విదేశీ స్త్రీకి పుట్టినవారు ఎప్పటికీ దేశభక్తుడు కాలేడు.. రాహుల్ గాంధీని దేశం నుంచి తరిమేయాలి.

Pragya Thakur

Pragya Thakur

Pragya Thakur: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గరంగరం అవుతోంది. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ.. భారత దేశంలో ప్రజాస్వామ్యంపై, మీడియాపై అణిచివేత కొనసాగుతోందని, మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు దాడులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. లండన్ లో మాట్లాడుతూ.. పార్లమెంట్ విపక్షాలు మాట్లాడే సమయంలో మైకులు కట్ చేస్తున్నాంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Groom Sleeps At Wedding: పెళ్లిలో తాగి పడుకున్న వరుడు..ఆ తరువాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

తాజాగా బీజేపీ నేత, ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. చాణక్యుడు చెప్పినట్లు విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని, దీన్ని రాహుల్ గాంధీ మరోసారి నిరూపించడాని ఆమె అన్నారు. మీ తల్లి ఇటలీ నుంచి వచ్చినవారు కావడంతో మీరు భారతదేశానికి చెందిన వారు కాదని మేము భావిస్తున్నామని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ మైక్ నిలిపేస్తున్నారనే వ్యాఖ్యలపై స్పందించిన ప్రజ్ఞా ఠాకూర్.. కాంగ్రెస్ పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించడం లేదని, పార్లమెంట్ సరిగ్గా జరిగితే ఎక్కువ పనులు జరుగుతాయని, అయితే అలా జరిగితే కాంగ్రెస్ మనుగడ సాధించలేదనే భయం వారిలో ఉందని, వారి ఉనికే ఉండదని అన్నారు.

రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలతో ఎన్నుకోబడ్డారు.. ఇప్పుడు ఇక్కడి ప్రజలను అవమానిస్తున్నారని, విదేశాల్లో కూర్చోని పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారని, ఇంతకన్నా అవమానం మరోటి ఉండదని, రాహుల్ గాంధీకి రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదని, దేశం నుంచి తరిమేయాలని ప్రజ్ఞా ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోఫాల్ ఎంపీగా ఉన్న ప్రజ్ఞా ఠాకూర్.. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆమె ఎదురుదాడికి దిగారు. సెప్టెంబరు 29, 2008న ఉత్తర మహారాష్ట్రలోని మతపరమైన సున్నితమైన పట్టణమైన మాలేగావ్‌లోని ఒక మసీదు సమీపంలో మోటార్‌సైకిల్‌కు పేలుడు పదార్ధం పేల్చడంతో ఆరుగురు మరణించారు మరియు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ఠాకూర్ 2017 నుండి బెయిల్‌పై బయట ఉన్నారు.