NTV Telugu Site icon

UP: యూపీలో అఖిలేష్ యాదవ్ పోస్టర్లు కలకలం.. ప్యూచర్ పీఎం అంటూ ఫ్లెక్సీలు

Akeie

Akeie

కాబోయే దేశ ప్రధాని అంటూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోస్టర్లు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో వెలిశాయి. జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు.. దీన్ని పురస్కరించుకుని సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు, నేతలు పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేశారు. అన్ని పోస్టర్లలో ‘కాబోయే ప్రధాని’ అంటూ ముద్రించారు. ఇదిలా ఉంటే ఇలా పోస్టర్లు రావడం ఇదే తొలిసారి.. ఇలా ఆయా సందర్భాల్లో పలుమార్లు వేసి అభిమానులు అభిమానం చాటుకున్నారు.

ఇది కూడా చదవండి: Solar Car: భారత్ లో మొదటి సోలార్ కార్ ఇదే..ఫీచర్స్ అదుర్స్!

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో 80 పార్లమెంటరీ స్థానాలకు గాను 37 స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. ఇక మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు గెలుచుకోగా.. బీజేపీ 33 గెలుచుకుంది. మరో మూడు సీట్లు దాని భాగస్వాములకు రెండు RLDకి, ఒకటి అప్నా దళ్ ( S) దక్కాయి. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ 1,70,922 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో పార్టీ సభ్యులు బర్త్‌డే సందర్భాన్ని పురస్కరించుకుని కాబోయే పీఎం అంటూ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇక అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్‌ను ఓడించి ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్ రాజకీయంగా సంచలనం సృష్టించారు.

ఇది కూడా చదవండి: CRIME: ఆన్‌లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి..రూ.2వేల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు

అయితే పోస్టర్లు వేయడం ద్వారా ఎవరూ ప్రధాని కాలేరని.. లక్నోలో పెట్టిన ‘ఫ్యూచర్ పీఎం’ హోర్డింగ్‌లను అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు .2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర రాజధానిలో ఇలాంటి హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. “రాష్ట్రం, దేశానికి నాయకత్వం వహిస్తారని అఖిలేష్‌ను విశ్వసిస్తున్నామని.. దేశానికి కొత్త ప్రధాని కావాలి’’ అనే నినాదాలతో కూడిన పోస్టర్లు వివిధ ప్రదేశాలలో కనిపించాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత

అఖిలేష్ .. ప్రముఖ నేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు. అఖిలేష్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేస్తున్నారు. గతంలో 38 సంవత్సరాల వయస్సులో యూపీకి 20వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపుపొందారు. ఎంపీగా గెలవకముందు 18వ విధానసభలో కర్హల్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. మార్చి, 2022 నుంచి జూన్ 2024 వరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పారు.