Bihar: రాజకీయ పార్టీలు ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకోవడం సహజం. అలాగే రాజకీయ నాయకులు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. విమర్శలు చేసుకోవడమే కాదు.. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోస్ట్లతో, కరపత్రాలతో ప్రచారం కూడా చేసుకుంటారు. రాజకీయాల్లో ఇది సర్వసాదారణం. అలాంటి ఘటనే బీహార్‌లో జరిగింది. బీహార్‌లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. బీహార్ రాజధాని పాట్నాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అయితే ఇవి రాజకీయాల కోసం ఆర్‌జేడీ నాయకులు కావాలని సృష్టించినవని బీహార్ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
Read also: Gas Leak: హైదరాబాద్ లో అమ్మోనియం గ్యాస్ లీక్.. 10 మందికి అస్వస్థత
మణిపూర్‌లో హింసను అరికట్టలేకపోయారు? బీహార్‌కు ప్రత్యేక హోదా ఏమైంది?..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి పాట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. లఖింసరాయ్‌లో ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అమిత్ షా గురువారం పాట్నాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాట్నాలో అమిత్ షాకు వ్యతిరేకంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ గోలాంబర్ వద్ద పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన, మణిపూర్‌లో హింస, ఈడీ, సీబీఐ..కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేయటం.. పలు అంశాల్ని ప్రస్తావిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేయటం చర్చనీయాంశమైంది. బీహార్ పర్యటనలో షా ముందుగా వీటికి సమాధానం చెప్పాలి? అని అర్థం వచ్చేట్టు వీటిని ఏర్పాటుచేశారు.
Read also: Asian Games 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! జట్టులోకి తెలుగు ఆటగాడు
గత రెండు నెలలుగా మణిపూర్‌లో ఎందుకు అశాంతి నెలకొని ఉందని ఒక పోస్టర్ అడుగుతోంది. బీహార్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తుందని మరో పోస్టర్‌లో ప్రశ్నించారు. మూడవ పోస్టర్ నేరుగా అమిత్ షాను ఉద్దేశించి, ED మరియు CBI వంటి సంస్థల మద్దతుతో పిరికి రాజకీయాలు చేస్తున్నారని పోస్టర్‌లో ప్రశ్నించారు. అయితే ఈ పోస్టర్లపై బీజేపీ బీహార్ యూనిట్ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ స్పందిస్తూ వాటిని ఆర్జేడీ కార్యకర్తలు ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే బీహార్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సింగ్ హైలైట్ చేశారు. స్కామ్‌లలో పాల్గొన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ED మరియు CBI దర్యాప్తు సంస్థలు దాడులు చేసి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని లాలూ ప్రసాద్ యాదవ్ నేరారోపణలను ఉటంకిస్తూ సింగ్ స్పష్టం చేశారు. పోస్టర్లతో ఆడుకోవద్దని సలహా ఇచ్చిన సింగ్ వివిధ కార్యక్రమాల ద్వారా బీహార్ పురోగతికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతతో ఉందని ప్రకటించారు. .