ప్రముఖ మోడల్ శాన్ రీచల్ ఆత్మహత్య చేసుకుంది. పుదుచ్చేరిలో తన తండ్రి ఇంట్లో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకుంది. అధిక ఒత్తిడి కారణంగా తనకు తానుగా మరణశాసనాన్ని రాసుకుంది.
ఇది కూడా చదవండి: Shubhanshu Shukla: ఐఎస్ఎస్ కి వీడ్కోలు!.. శుభాంశు శుక్లా నేడు భువి పైకి తిరుగు ప్రయాణం..
ప్రముఖ మోడల్ శాన్ రీచల్(26) ఆదివారం పుదుచ్చేరిలో ఆత్మహత్య చేసుకుని మరణించిందని పోలీసులు తెలిపారు. రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ప్రయోజం లేదని.. చివరికి జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఆమె మరణించింది. ఇటీవలే ఆమెకు వివాహం జరిగింది. వినోద పరిశ్రమలో ఆమె వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడింది.
ఇది కూడా చదవండి: Pooja Hegde : పూజా హెగ్డేకు బిగ్ ఛాన్స్ – టాలీవుడ్‌లో గ్రాండ్ రీ ఎంట్రీ ఖాయం
ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత ఒత్తిడి కారణంగా ఆమె కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన వృత్తిని ముందుకు సాగించడానికి తన ఆభరణాలను తాకట్టు పెట్టి విక్రయించిందని అధికారులు వెల్లడించారు. తండ్రి నుంచి సాయం కోరితే అందుకు నిరాకరించాడని.. కొడుకు మీద ఉన్న ప్రేమ.. కుమార్తె మీద చూపించలేదని.. ఇదే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తు్న్నారు.
ఇక పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని రాసి పెట్టింది. అయితే వివాహ బంధంలో ఏమైనా సమస్యలు తలెత్తాయేమోనని నిర్ధారించడానికి తహశీల్దార్ విచారణకు ఆదేశించారు.
శాన్ రీచల్ మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె తన పని ద్వారానే కాకుండా భారతీయ సినిమా, ఫ్యాషన్‌లో రాణించింది. ఫెయిర్-స్కిన్ వ్యామోహాన్ని సవాలు చేసింది. నల్లటి చర్మం గల వ్యక్తులు.. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఆమె గళం విప్పింది. 2022లో మిస్ పుదుచ్చేరి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
