Site icon NTV Telugu

Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..

Rahul Gandhi

Rahul Gandhi

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కీలక సూచనలు చేసింది. రక్షణ దళాల కార్యకలాపాలకు సంబంధించి రాజకీయ ప్రచారానికి పాల్పడొద్దని, రాజ్యాంగం రద్దు చేస్తారంటూ తప్పుదు అభిప్రాయాలను కలిగించే ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. ఈ రెండు ప్రచారాలతో రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తున్నారు. తన రాజకీయ ప్రసంగాల సమయంలో రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారు. త్రివిధ దళాల్లో ప్రవేశపెట్టి ‘అగ్నివీర్’ పథకానికి వ్యతిరేకంగా రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసీ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలకు కొన్ని గంటల ముందు హర్యానాలో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈసీ పంపిన ఆదేశాల్లో ప్రముఖంగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించింది.

Read Also: Skirts: అమ్మాయిలు “స్కర్టులు” ధరించడాన్ని నిషేధించిన ప్రైమరీ స్కూల్.. కారణం ఏంటంటే..?

రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటున్నాయని ఈసీ పేర్కొంది. కాంగ్రెస్ ప్రచారకర్తలు, అభ్యర్థులు రక్షణ దళాల కార్యకలాపాలు, సామాజిక-ఆర్థిక కూర్పుకు సంబంధించి విభజన ప్రకటనలు చేయవద్దని ఖర్గేని కోరింది. భారత రాజ్యాంగం రద్దు చేయవచ్చనే తప్పుడు ప్రకటనలు చేయకుండా ఉండాల్సిందిగా కాంగ్రెస్ తన పార్టీ స్టార్ క్యాంపెనర్లను తప్పనిసరిగా కోరాలని పేర్కొంది. ఇటీవల రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి.

Exit mobile version