NTV Telugu Site icon

MP: ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాల్లో ఘర్షణ.. నిందితులకు గుండు గీయించి, ఉరేగించిన పోలీసులు..

Mp

Mp

MP: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్‌, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది, ఘర్షకు కారణమైంది. దీంతో హింస చెలరేగింది.

Read Also: Parliamentary Panel: రోహింగ్యా, బంగ్లాదేశీలను భారత్ నుంచి పంపించాలి..

అయితే, దేవాస్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు.

మోవ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రస్తుతం మోవ్‌లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని, అల్లర్లలో పాల్గొన్న 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. ఒక మసీదు సమీపంలో వివాదం చెలరేగిందని, అక్కడ ఊరేగింపుపై ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయని, దీంతో ఇద్దరి మధ్య భౌతిక ఘర్షణకు దారి తీసిందని పేర్కొన్నారు.