రైతులకు అండగా ఉంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో ఉన్న రైతు బంధు పథకం తరహాలో.. దేశవ్యాప్తంగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకంలో 9 కోట్లకు పైగా రైతులు చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.. ఇక, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అందజేస్తోంది మోడీ సర్కార్.. ఆ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తూ వస్తున్నారు.. అయితే తాజాగా..
ఈ పథకం కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5 కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది.
రైతులకు మోడీ సర్కార్ తీపికబురు..ఇవాళే అకౌంట్లలో డబ్బులు
