Site icon NTV Telugu

PM Modi China Tour: ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాకు భారత ప్రధాని.. ఆగస్టు 31న జిన్‌పింగ్‌తో మోడీ భేటీ

China

China

PM Modi China Tour: ఆగస్టు 31వ తేదీన జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించబోతున్నారు. ఈ టూర్ ఇటీవలి కాలంలో, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం, భారత్- చైనా మధ్య సంబంధాలలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవాలి. నేటి సాయంత్రం రెండు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్తున్న మోడీ. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు చైనా నగరమైన టియాంజిన్‌లో పర్యటిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: Kamal Haasan: ట్రంప్ సుంకాలపై భారత్‌కు కమల్‌హాసన్ కీలక సూచనలు

అయితే, ఏడు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు వెళ్లడం ఇదే మొదటి పర్యటన అవుతుంది. ప్రాంతీయ, ప్రపంచ గతిశీలత అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ టూర్ కి ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత్- అమెరికా నుంచి వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లడం ఉత్కంఠ రేపుతుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని భారత్ పై కక్షగట్టిన ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం వివిధ దేశాలతో కొత్త ఒప్పందాలను చేసుకుని.. తన వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనడంతో భారతదేశం దౌత్యపరమైన అంశాలతో పాటు ఆర్థిక వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు.

Exit mobile version