గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది.. తన సొంత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. అహ్మదాబాద్‌లోని రణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో తన ఓటు వేశారు మోడీ… ప్రత్యేక భద్రత మధ్య ఓటింగ్ కేంద్రానికి చేరుకుంది మోడీ కాన్వాయ్.. ఇక, తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిన ఆయన.. సామాన్య ఓటరుగానే మిగతా ఓటర్ల మధ్య క్యూలైన్‌లో వెళ్లి ఓటు వేశారు.. ఇక, ప్రధానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.. ఇక, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పోలింగ్ బూత దగ్గర ఓటు వేసినట్టు.. తన వేలికి పెట్టిన సిరను చూపిస్తూ.. ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అహ్మదాబాద్‌లో నేను ఓటు వేశారు.. ఈరోజు ఓటు వేసే వారందరూ రికార్డు స్థాయిలో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కామెంట్ పెట్టారు.
Read Also: MLC Kavitha Letter to CBI: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ.. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు.. 6న కలవలేను..!
కాగా, ఇవాళ రెండో దశలో పోలింగ్ జరుగుతోంది.. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీతో కలిపి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. బీజేపీ, ఆప్ 93 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టగా.. కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేస్తూ.. తన మిత్రమక్షమైన ఎన్సీపీ అభ్యర్థులను రెండుచోట్ల నుంచి బరిలోకి దించింది.. ఇక, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 12 చోట్ల, బీఎస్పీ 44 చోట్ల పోటీ చేస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంతా తానై ప్రచారం నిర్వహించారు.. ర్యాలీలు, సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు.. ఒక, తుది దశలో మొత్తం 2.51కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుషులు, 1.22కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లు 5.96లక్షల మంది ఉండటం గమనార్హం. రెండో దశ కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. ప్రధాని మోడీ సహా.. ఇతర ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నాంరు.
Cast my vote in Ahmedabad. Urging all those voting today to turnout in record numbers and vote. pic.twitter.com/m0X16uCtjA
— Narendra Modi (@narendramodi) December 5, 2022
