PM Modi: ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లావోస్‌లోని 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. నేను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చాను అని పేర్కొన్నారు. ఇది యుద్ధాల యుగం కాదు.. యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు లభించవు అని మోడీ వెల్లడించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని నరేంద్ర మోడీ తెలిపారు.
Read Also: Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..
ఇక, ప్రపంచ శాంతి భద్రతకు ఉగ్రవాదం సైతం తీవ్రమైన పెను సవాలుగా మారింది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. దీన్ని ఎదుర్కొనేందుకు మానవత్వంపై విశ్వాసమున్న శక్తులన్నీ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా సైబర్, సముద్ర, అంతరిక్ష రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి అని ఆయన వెల్లడించారు. కాగా, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి.. సమస్యల పరిష్కారానికి చర్చలకు, దౌత్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. యురేషియా, పశ్చిమాసియాల్లో శాంతి స్థిరత్వం పునరుద్ధరించాలని ప్రధాని మోడీ తెలిపారు.