NTV Telugu Site icon

Narandra Modi: ప్రజలే మాకు తొలి ప్రాధాన్యత.. అందుకే ధరలు తగ్గించాం

Narendra Modi

Narendra Modi

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ప్రధాని మోదీ స్పందించారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రధాన్యత అని మోదీ వెల్లడించారు. దేశంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఎంతో సహాయపడుతుందని మెదీ గుర్తుచేశారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్‌కు రూ.200 సబ్సిడీ ఇవ్వడం పేద కుటుంబాలకు బడ్జెట్‌ విషయంలో ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.

Petrol Rates: రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ ధరలు తగ్గిస్తాయా?

మరోవైపు ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు ప్రధాని మోదీకి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ట్యాక్సులు తగ్గించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యాట్‌ను విపరీతంగా పెంచడంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ తగ్గించాలని.. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.