NTV Telugu Site icon

Bigg Boss 18: బిగ్ బాస్ ఆఫర్‌ని తిరస్కరించిన పీఎం మోడీ మాజీ బాడీగార్డ్..

Lucky Bisht

Lucky Bisht

Bigg Boss 18: ప్రధాని నరేంద్రమోడీ మాజీ బాడీగార్డ్ లక్కీ బిష్త్  తాను బిగ్ బాస్ 18 ఆఫర్ తిరస్కరించినట్లు చెప్పారు. మాజీ ‘‘రా’’ ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో అయిన లక్కీ బిష్త్  బిగ్ బాస్‌లో పాల్గొనాలని ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. ఒకప్పుడు బిష్త్ ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేశారు.

తాను తన జీవితంలోని అనేక అంశాలను వెల్లడించలేనని అందుకే ఆఫర్ తిరస్కరించినట్లు చెప్పారు. ‘‘రా ఏజెంట్‌గా, మా జీవితాలు తరచుగా గోప్యత, మిస్టరీతో ఉంటాయి. చాలా తక్కువ మందికి మనం ఎవరో నిజమైన వివరాలు తెలుసు. మా గుర్తింపును వ్యక్తిగత జీవితాలను ఎప్పటికీ బహిర్గతం చేయకుండా మేము శిక్షణ పొందాము. నేను దీనికి కట్టుబడి ఉన్నాను. ప్రజలు దీనిని అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని బిష్త్ అన్నారు. బిగ్ బాస్ 18 టీంతో పాటు తన సొంత టీమ్‌తో అనేక సార్లు చర్చలు జరిపానని, అయితే రియాలిటీ షోలో పాల్గొనకుండా తనకు సలహా ఇచ్చారని అతను చెప్పాడు.

Read Also: Mutton Curry: మటన్ ముక్కల కోసం కొట్లాట.. బీజేపీ ఎంపీ విందులో ఘటన..

లక్కీ బిష్త్ ఎవరు..?

భారతీయ సుప్రసిద్ధ స్నైపర్, రా ఎజెంట్ బిష్త్ 2009లో ఇండియాలోనే బెస్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో అనే బిరుదును పొందారు. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతడి భద్రతా అధికారిగా బిష్త్ పనిచేశారు. 2010లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భారత్ సందర్శించిన సమయంలో బిష్త్ కూడా భద్రతలో భాగంగా ఉన్నారు. 2011లో ఉత్తరాఖండ్‌లోని నేపాల్ సరిహద్దులో రాజు పర్గాయ్, అమిత్ ఆర్య జంట హత్యల కేసుకు సంబంధించి బిష్త్ పేరు రావడంతో అరెస్టయి, జైలుకు వెళ్లాడు. అయితే, బిష్త్‌పై తగిన ఆధారాలు లేవని 2018లో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌ని వదిలేశారు. బాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్, ఫిల్మ్ మేకర్‌గా కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.