NTV Telugu Site icon

PM Modi: పీఎం మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో విమానంలో టెక్నికల్ స్నాగ్ ఏర్పడింది. జార్ఖండ్ డియోఘర్‌లో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే వరకు విమానం అక్కడే ఉంటుంది. దీంతో ప్రధాని ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం కానుంది. గిరిజనుల ఐకాన్ బిర్సా ముండా వార్షికోత్సవాన్ని జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకునేందుకు, దీంతో పాటు నవంబర్ 20న జార్ఖండ్ రాష్ట్రంలో జరగబోయే రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రధాని మోడీ రెండు ర్యాలీల్లో ప్రసంగించారు.

Show comments