NTV Telugu Site icon

Amit Shah: మోడీ మూడోసారి ప్రధాని అవుతారు.. 300 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం.

Amit Shah

Amit Shah

Amit Shah: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గౌహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రెండు సార్లు ప్రధాని నరేంద్రమోడీకి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని.. మూడోసారి కూడా మోడీ ప్రధాని అవుతారని, బీజేపీ 300 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Hyderabad Crime: హైదరాబాద్‌లో విషాదం.. భర్త మరణాన్ని భరించలేక..

అజాదీ కా అమృత్ ఏడాదిలో మే 28న ప్రధాని కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారని, కాంగ్రెస్ విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయని, కాంగ్రెస్ ప్రవర్తనే నెగిటివ్ గా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిని ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. కొన్ని రాష్ట్రాల నూతన అసెంబ్లీల ప్రారంభోత్సవాలకు భూమి పూజలకు గవర్నర్ ను పిలవకపోవడాన్ని అమిత్ షా ప్రస్తావించారు. చత్తీస్‌గడ్ కొత్త అసెంబ్లీ భూమి పూజకు గవర్నర్ ని పిలువలేదని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఆహ్వానించిన విషయాన్ని షా గుర్తు చేశారు. జార్ఖండ్ లో హెమంత్ సోరెన్ గవర్నమెంట్, అస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని తరుణ్ గగోయ్ ప్రభుత్వం, గతంలో మణిపూర్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాలు ఇలానే చేశాయని అన్నారు.

కాంగ్రెస్ చేస్తే అన్ని మంచివి అవుతాయి..కానీ బీజేపీ మాత్రం అలా చేస్తే బహిష్కరిస్తుంటాని అమిత్ షా అన్నారు. దేశప్రజలు మూడింత రెండొంతుల మెజారిటీని ప్రధాని మోడీకి కట్టబెట్టారని, కాంగ్రెస్ దీన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదని, తొమ్మిదేళ్లుగా ప్రజాతీర్పును అంగీకరించడం లేదని అమిత్ షా అన్నారు. పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడే సమయంలో ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, వారంతా బహిష్కరిస్తే ఏం కాదని ఆయన అన్నారు. భారత ప్రజల ఆశీస్సులతో భారత పార్లమెంట్ నిర్మితమవుతోందని, న్యూ ఇండియా ఇన్ న్యూ పార్లమెంట్ అని ఆయన అన్నారు. 130 కోట్ల భారత ప్రజలు దీన్ని చూస్తారని, 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు భారీ విజయాన్ని అందిస్తారని, మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అమిత్ షా అన్నారు.