Site icon NTV Telugu

PM Modi: సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ప్రధానిమోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్..

Modi, Putin

Modi, Putin

PM Modi: ఉక్రెయిన్ యుద్ధం, సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా తిరుగుబాటు గురించి ఇరువురు నేతలు సంభాషించారు. ఏ రకంగా తిరుబాటును పరిష్కరించారే వివరాలను పుతిన్, మోడీకి వివరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ చుట్టుపక్కల పరిస్థితి గురించి నేతలు మాట్లాడారు. గత శనివారం రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ ప్రిగోజిన్ రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తాడు. ఆ తరువాత బెలారస్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గారు. ప్రిగోజిన్ రష్యాను వదిలి బెలారస్ వెళ్లారు. శాంతిభద్రతలను పరిరక్షించడానికి, దేశంలో స్థిరత్వం మరియు పౌరుల భద్రతను నిర్ధారించడానికి రష్యా నాయకత్వం యొక్క నిర్ణయాత్మక చర్యలకు నరేంద్ర మోడీ మద్దతు తెలిపినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.

వీటితో పాటు ఈ ఏడాది భారత్ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ), జీ-20 సమావేశాలకు అధ్యక్షత వహిస్తోంది. ఈ రెండు ప్రతిష్టాత్మక సదస్సులకు భారత్ వేదిక కానుంది. వీటిపై కూడా పుతిన్, మోడీ చర్చించారు. ఇరు దేశాల మధ్య దైపాక్షిక బంధం గురించి మాట్లాడారు.

Exit mobile version