NTV Telugu Site icon

PM Modi: ఉపరాష్ట్రపతిని పరామర్శించిన పీఎం మోడీ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థన..

Pm Modi

Pm Modi

PM Modi: ఛాతి నొప్పితో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ పరామర్శించారు. ధంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ఎయిమ్స్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ జీ ఆరోగ్యం గురించి ఆరా తీశాను. ఆయన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా కూడా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

Read Also: BMW C 400 GT: స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధర తెలిస్తే గుండె గుభేలే

ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ధంకర్ ఎయిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో చేరారు. ఛాతి నొప్పి, అసౌకర్యంగా అనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. 73 ఏళ్ల ధంకర్‌కి కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ రాజీవ్ నారంగ్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమచారం. ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది.