Site icon NTV Telugu

PM Modi: సింగపూర్లో బిజీబిజీగా ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ కంపెనీ సందర్శన..!

Modi

Modi

PM Modi: సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటనకు అక్కడికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (గురువారం) ఉదయం సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర, దాని కార్యకలాపాలు, భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అక్కడి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారత్‌తో సహకారానికి ఛాన్సులపై ప్రధాని మోడీకి తెలియజేసింది.

Read Also: Maharashtra : ఛత్రపతి శివాజీ విగ్రహం తయారు చేసిన శిల్పి అరెస్ట్

అలాగే, సింగపూర్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ ఇంటర్న్‌లతో పాటు CII- ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ఇండియా రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశాన్ని సింగపూర్ ఇంటర్న్‌లు సందర్శించారు. అలాగే, AEMలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలుసుకుని వారితో సంభాషించారు. ఈ సందర్బంగా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను భారత ప్రధాని ఆహ్వానించారు. సింగపూర్‌లో బాగా అభివృద్ధి చెందిన చాలా సెమీకండక్టర్ పరిశ్రమలు ఉన్నాయి. భారత్‌లో చిప్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, మెరుగైన వాణిజ్య అవకాశాల పరంగా సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాని మోడీ పర్యటన కీలకమైంది.

Exit mobile version