Site icon NTV Telugu

PM Modi: రేపు ఛత్తీస్‌గఢ్‌లో మోడీ పర్యటన.. రాష్ట్ర దినోత్సవ వేడుకలకు హాజరు

Modi5

Modi5

ప్రధాని మోడీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలు ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇక పర్యటనలో భాగంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ , ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇక పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతో సంభాషించనున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించి.. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసం, ధ్యానం కోసం ఆధునిక కేంద్రమైన బ్రహ్మ కుమారీల ‘శాంతి శిఖర్’ను కూడా మోడీ ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు

Exit mobile version