Site icon NTV Telugu

Har Ghar Tiranga Campaign: ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి.. ప్రధాని పిలుపు

Har Ghar Tiranga Campaign

Har Ghar Tiranga Campaign

హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. కాగా.. హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. అంతేకాకుండా.. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు ప్రధాని. అయితే.. వారి ఆశయాలను నెరవేర్చేందుకు, తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈనేపథ్యంలో.. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోడీ ‌ట్విట్టర్‌లో షేర్​ చేశారు.

అయితే ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందును ఇస్తున్నారు. ఈనేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మొగులయ్య, రామచందర్ రావులను కూడా ఆహ్వానించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మీడియాకు చెప్పారు.ఈనేపథ్యంలో.. మరో వైపు NDA భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే.. రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు .ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రులతో పాటు పలువురికి కోవింద్ విందు ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ ఉదయం తిరుపతి నుంచి వచ్చిన అర్చకులు ద్రౌపది ముర్మును ఆశీర్వదించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి చెందిన ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్మును అభినందించేందుకు పలువురు ఆమె ఇంటికి క్యూ కట్టారు, అయితే.. ఈ నెల 25వ తేదీన ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.

Exit mobile version