భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.. ఒకే రోజు దేశ్యాప్తంగా 86 లక్షలకు పైగా డోసులు వేసిన కొత్త రికార్డు సృష్టించిగా.. దీనిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందన్నారు.. వ్యాక్సిన్ తీసుకోవడంపై అను అనుమానాలను అధిగమించాలని పిలుపునిచ్చారు… మహమ్మారిపై ప్రజల పోరాటం కొనసాగుతోందని.. ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామన్నారు. మధ్యప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మాట్లడారు ప్రధాని మోడీ.. వ్యాక్సిన్‌పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలపడంతో.. దానిపై స్పందించిన ఆయన.. వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
చరిత్ర సృష్టించాం.. వదంతులు నమ్మొద్దు..

PM Modi