NTV Telugu Site icon

PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi To Visit Brunei: ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బ్రూనైలో పర్యటించనున్నారు. బుధవారం సింగపూర్‌లో పర్యటిస్తారు. బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు సింగపూర్‌తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశ్వాసం వ్యక్తం చేశారు.

బ్రూనైలో తొలిసారి ఓ భారత పర్యటన పర్యటించబోతున్నారు. చారిత్రాత్మక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యలతో తాను సమావేశం కావడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.

Read Also: Bangladesh: ఉగ్రవాదులతో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..

ఇదిలా ఉంటే, బుధవారం సింగపూర్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రులు లీ సీన్ లూంగ్, గో చోక్ టోంగ్‌లను కలిసేందుకు ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. సింగపూర్ వ్యాపార సంఘాల నేతలతో మోడీ భేటీ కానున్నారు. “సింగపూర్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా అధునాతన తయారీ, డిజిటలైజేషన్ మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలలో సంబంధాలని పటిష్టం చేయడానికి నా చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

భారత్ ‘‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’’ మరియు ఇండో-పసిఫిక్ విజన్‌లో ఈ రెండు దేశాలు ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నా్యని ఆయన అన్నారు. ‘‘బ్రూనై, సింగపూర్ ఆసియాన్ ప్రాంతంలో మా భాగస్వామ్యాన్ని నా పర్యటన మరింత బలోపేతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను’’ ప్రధాని అన్నారు.

Show comments