NTV Telugu Site icon

PM Modi: నేడు రోజ్‌గార్‌ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi: నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్‌గార్‌ మేళా ప్రోగ్రాంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను ఇవ్వనున్నారు.

Read Also: Maharashtra: ఫోన్ కొనేందుకు నిరాకరించిన తల్లి.. 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..

ఇక, ఉన్నత విద్యా శాఖ, వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవలు, కేంద్ర హోంశాఖ, పోస్టల్‌ డిపార్ట్మెంట్ తదితర శాఖల్లో 71 వేల మందిని ఒకేసారి భర్తీ చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. అయితే, రోజ్‌గార్ మేళా దేశ నిర్మాణంతో పాటు స్వీయ-సాధికారతలో యువకుల భాగస్వామ్యం ఉండాలని ప్రధాని మోడీ తెలిపారు.