PM Modi To Distribute 71,000 Job Letters To New Recruits On Jan 20: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ జాబ్ లెటర్స్ అందించనున్నారు. జనవరి 20న దాదాపుగా 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించబోతున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకారం.. ప్రధాని మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వాారా ఉదయం 10.30 గంటలకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తారని, కొత్తగా జాబులో చేరబోతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.
Read Also: PM Narendra Modi: అభివృద్దే మా ప్రాధాన్యత.. ఓటు బ్యాంకు రాజకీయాలు కావు..
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపికైన ఉద్యోగులు జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ డాక్ సేవక్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టీచర్, డాక్టర్, నర్స్ ఇలా పలు పోస్టుల్లో చేరనున్నారు. రోజ్‌గార్ మేళా కింద యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కేంద్రమంత్రులు జనవరిలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సీనియర్ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, హర్దీప్ పూరి, అనురాగ్ ఠాకూర్ పాటు మొత్తం 45 మంది మంత్రులు రోజ్‌గార్ మేళాలో పాల్గొననున్నారు.
కేంద్రం 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ‘రోజ్‌గార్ మేళా’ను ప్రారంభించింది. మొదటి విడతలో ఇప్పటికే 75,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం వరసగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
