Site icon NTV Telugu

PM Narendra Modi: రేపు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2022 గ్రాండ్ ఫినాలేలో ప్రధాని ప్రసంగం

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2022 గ్రాండ్ ఫినాలేలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం.. దేశంలో, ముఖ్యంగా యువతలో ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ దృష్టితో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) 2017వ సంవత్సరంలో ప్రారంభించబడింది.

Noida Twin Towers: 9 సెకన్లలో కూలనున్న ట్విన్‌ టవర్స్.. కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు

సమాజం, సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక వేదికను అందించడానికి దేశవ్యాప్త చొరవే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. విద్యార్థులలో ఉత్పత్తి ఆవిష్కరణ, సమస్య-పరిష్కారం, ఆలోచనా సంస్కృతిని పెంపొందించడం దీని లక్ష్యం. ఈ గ్రాండ్ ఫినాలేలో 75 కేంద్రాలకు చెందిన 15,000కు పైగా విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. 2900కు పైగా పాఠశాలలు, 2200 ఉన్నత విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఈ ఫినాలేలో 53 కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందిన 476 సమస్యల ను పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేస్తారు. ఈ సంవత్సరంలో, పాఠశాల విద్యార్థుల మనస్తత్వాన్ని అభివృద్ధి పరచడంతో పాటు నూతన ఆవిష్కరణల సంస్కృతి ని తీర్చిదిద్దడం కోసమని పాఠశాల విద్యార్థులకు ఒక ప్రయోగాత్మక కార్యక్రమంగా‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌-జూనియర్’ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

Exit mobile version