NTV Telugu Site icon

PM Modi Swearing-In : ముచ్చటగా మూడోసారి.. ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం..

Pm Modi

Pm Modi

PM Modi: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుల్లో 30 మంది కేబినెట్ మంత్రుల కాగా, 36 మంది సహాయమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2014, 2019, 2024లో వరసగా మూడు పర్యాయాలు ప్రధానిగా మోడీ బాధ్యతలు చేట్టారు.

RAED ALSO: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!

ప్రధానిగా మోడీతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ కట్టర్ తదితరులు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్డీయేలోనిమిత్ర పక్షాలకు 11 మందికి మంత్రి పదవులు దక్కాయి.  72 మంది మంత్రుల్లో 43 మంది పార్లమెంట్‌లో మూడు పర్యాయాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారు కాగా, 39 మంది ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మంత్రి మండలిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా ఓబీసీ నుంచి 27 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి మంత్రి పదవులు దక్కాయి.

మోడీ ప్రమాణస్వీకారానికి భారత ఇరుగుపొరుగు దేశాలకు చెందిన దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హాజరయ్యారు.