NTV Telugu Site icon

PM Modi: అమెరికా టూర్‌ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోడీ

Modi1

Modi1

ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఎలాన్ మస్క్‌తో సహా పలువురు కీలక నేతలను మోడీ కలిశారు. ఇక ట్రంప్ అయితే మోడీని కౌగిలించుకుని ఆహ్వానం పలికారు. ఇందుకు సంబంధించిన అమెరికా పర్యటన విశేషాలను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంధనం నుంచి విద్య వరకు.. వాణిజ్యం నుంచి సాంకేతికత వరకు.. ఏఐ నుంచి అంతరిక్షం వరకు అనేక అంశాలను చర్చించినట్లు మోడీ పోస్టులో పేర్కొన్నారు. ఇక అమెరికా పర్యటన చాలా ఫలవంతంగా జరిగిందని మోడీ స్పష్టం చేశారు.

మోడీ సోషల్ మీడియాలో 3:45 నిమిషాల వీడియోను పోస్టు చేశారు. అందులో వాషింగ్టన్ పర్యటనలోని కీలక క్షణాలు గుర్తుచేశారు. అమెరికా ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై సంభాషించిన దృశ్యాలు పంచుకున్నారు.