Site icon NTV Telugu

PM Modi Security Breach: ప్రధాని మోడీ కారుపై చెప్పు విసిరారు.. వీడియో వైరల్..

Pm Modi Security Breach In Varanasi

Pm Modi Security Breach In Varanasi

PM Modi Security Breach: ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత రాలేదు.

Read Also: Star Hospital: స్టార్ ట్రామా అండ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్‌వర్క్తో 15 నిమిషాల్లో అంబులెన్స్ సేవలు..

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినప్పటికీ ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రోజున ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో పంజాబ్‌లో కూడా ఇలాగే ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యం ఎదురైంది. కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై కాన్వాయ్ నిలిచిపోయింది.

Exit mobile version