Site icon NTV Telugu

PM Modi: వందేమాతరం ఒక శక్తి.. నవంబర్ 7 చారిత్రాత్మక రోజు అన్న మోడీ

Pmmodi

Pmmodi

వందేమాతరం అనేది ఒక మంత్రం.. ఒక కల.. ఒక సంకల్పం.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను మోడీ ఆవిష్కరించనున్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘ఓట్ చోరీ’’పై ఈసీ ఇప్పటిదాకా స్పందించలేదు.. మరిన్ని ఆధారాలు ఉన్నాయన్న రాహుల్‌గాంధీ

అనంతరం మోడీ ప్రసంగించారు. ‘‘వందేమాతరం అనేది ఒక మంత్రం. ఒక కల. ఒక సంకల్పం. ఒక శక్తి. ఇది దేశానికి ఒక ప్రార్థన. ఇది మనల్ని చరిత్రలోకి తీసుకెళుతుంది. ఇది మన భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తుంది. భారతీయులు సాధించలేని సంకల్పం లేదు. సాధించలేని లక్ష్యం లేదు.’’ అని మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కల బెడదపై మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నవంబర్ 7 అనేది ఒక చారిత్రాత్మక రోజు అని.. వందేమాతరం ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోట్లాది మంది భారతీయుల్లో కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడికి శుభాకాంక్షలు తెలిపారు.

వందేమాతరం చరిత్ర ఇదే..
వందేమాతరం గేయాన్ని 1875లో సరిగ్గా నవంబర్ 7న అక్షయ్ నవమి పండుగ రోజున.. ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఇది బంకించంద్ర రచించిన “ఆనంద్ మఠ్” నవలలో అంతర్భాగంగా ఉంది. తొలిసారిగా “బంగాదర్శన్” అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. భారత స్వాతంత్రోద్యమంలో ఈ గేయం కీలక పాత్ర పోషించింది. అత్యంత వేగంగా దేశ భక్తికి ప్రతీకగా మారి స్వాతంత్రోద్యమాన్ని ఉత్తేజపరిచింది. ఇక 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన సందర్భంగా ఈ “వందేమాతరం” గేయాన్ని “జాతీయ గేయంగా” గుర్తించారు.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ 2025 సంవత్సరాన్ని 150 ఏళ్ల “వందే మాతరం”గా పరిగణించింది. ఈ రోజు నుంచి వచ్చే ఏడాది 2026, నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా వందేమాతరం జాతీయ గేయం సంస్మరణోత్సవాలను జరపాలని నిర్ణయించింది.

Exit mobile version